మురసు తుపాను తీవ్రత: ఆకాశమార్గం నుంచి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు
రిపోర్టర్: సతీష్
స్థలం: Amaravati
మురసు తుపాను ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం హెలికాప్టర్ ద్వారా ఆకాశమార్గం నుంచి పరిశీలించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్ లో జలదిగ్బంధంలో ఉన్న గ్రామాలు, పంటనష్టాన్ని ఆయన స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా వరద ప్రవాహాలపై జిల్లాల కలెక్టర్లు మరియు అధికారులతో సమీక్ష నిర్వహించి, చెరువులకు గండ్లు పడకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను స్పష్టంగా ఆదేశించారు.