తూర్పుగోదావరిలో కూటమి ప్రభంజనం: మున్సిపల్ ఎన్నికల్ లో వైకాపా ఘోర పరాజయం
రిపోర్టర్: సతీష్
స్థలం: తూర్పుగోదావరి
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తూర్పుగోదావరి జిల్లాలో ఎన్డీయే కూటమి అపూర్వ విజయం సాధించిందని ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం తొంభై ఆరు స్థానాలకు గాను వైకాపా అభ్యర్థులు కేవలం మూడు చోట్ల మాత్రమే విజయం సాధించారని పేర్కొన్నారు. మండపేట, కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంఘాల్ లో కూటమి అభ్యర్థులు భారీ విజయాలు నమోదు చేసుకున్నారని అధికారులు స్పష్టం చేశారు.