మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితులనే నిందించే పితృస్వామ్య విధానాలను ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలు రోడ్లపై నడవాలన్నా, స్వేచ్ఛగా తిరగాలన్నా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కల్పించాల్సిందిపోయి ఇళ్లకే పరిమితం కావాలంటూ పరోక్షంగా హెచ్చరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.