లంకమల్ల అడవుల్లో కలకలం: ఏడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న అధికారులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు అటవీ పరిధిలోని లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్లో అధికారులు గురువారం నిర్వహించిన తనిఖీలలో సుమారు 234 కిలోల బరువున్న ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కడప జిల్లా అటవీశాఖాధికారి నుంచి అందిన పక్కా సమాచారంతో ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో బీట్ల వారీగా సోదాలు చేపట్టామని, అధికారులను చూసి స్మగ్లర్లు దుంగలను అక్కడే వదిలేసి పరారయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు.