కాన్పూర్‌లో దారుణం: గుండెపోటుగా చిత్రీకరించేందుకు మామను హత్య చేసిన కోడలు

రిపోర్టర్: శివ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆస్తి వివాదం నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాపారి వినీత్ మినోచాను గుండెపోటుగా హత్య చేయాలని కోడలు షాలు ప్లాన్ వేసింది. హంతకులు ఇంట్లోకి చొరబడి వినీత్‌ను 26 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. హత్య జరుగుతున్న సమయంలో కోడలు, ఆమె భర్త లాంజ్‌లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం గమనార్హం. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.