ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్లపై కొత్త నిబంధనలంటూ సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: Dispur

అస్సాంలో ముస్లిం వివాహాల నమోదు కోసం రాష్ట్ర మంత్రివర్గం సరికొత్త నిబంధనలను ఆమోదించినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఇకపై ముస్లిం వివాహాలన్నీ ప్రభుత్వ రిజిస్ట్రార్ల ద్వారానే అధికారికంగా నమోదు చేయబడతాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఉన్న కాజీల రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వివాహ సమయంలో వధువు వయస్సు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు, వరుడి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.