'దరఖాస్తులు చేసుకోండి..': ఎస్ఎస్సీ జేఈ పరీక్ష ప్రకటన విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: భారతదేశం

భారత వాతావరణ శాఖలో శాస్త్రవేత్త సహాయకుల పోస్టులతో పాటు జూనియర్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ జేఈ పరీక్ష ప్రకటనను విడుదల చేసింది. ssc.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1748 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు.