మృత్యుపాశంగా మారిన కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ గ్రిల్స్

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ముఖద్వారం వద్ద ఉన్న గ్రిల్స్ పూర్తిగా అద్వాన్నంగా మారి వాహనదారులకు మృత్యుపాశంగా పరిణమించాయి. ఈ గ్రిల్స్ తుప్పు పట్టడంతో పాటు మధ్యలో ఏర్పడిన ఖాళీలలో పడి జర్నలిస్టు మేఘన ఎడమ కాలు విరిగిపోయింది. నిత్యం వందలాది మంది వచ్చే స్టేషన్ ఆవరణలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై జర్నలిస్టు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణ స్పందనకు కోరుతున్నాయి.