పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండన్న ఎమ్మెల్యే కసిరెడ్డి
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. తలకొండపల్లి మండలానికి చెందిన బాధితులకు తన నివాసంలో చెక్కులు అందజేశారు. వైద్య సేవలు పొందలేని పేదలకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.