ఉమ్మడి కృష్ణా జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి హవా: సర్వత్రా ఆసక్తి

రిపోర్టర్: రాజేష్ స్థలం: కృష్ణా జిల్లా

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూటమి పార్టీలదే పైచేయిగా కనిపిస్తోందని స్థానిక రాజకీయ పరిశీలకులు తెలిపారు. పెడన, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, ఉయ్యూరుల్లో కూటమి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని, కేవలం నూజివీడులో మాత్రమే కొంత ఉత్కంఠ నెలకొందని విశ్లేషకులు పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమనే భావన ఓటర్లలో వ్యక్తమవుతోందని, వైకాపా శ్రేణుల్లో పట్టు సడలడం కూటమికి మరింత కలిసొచ్చే అంశంగా మారిందని సమాచారం.