మేడ్చల్ జిల్లాలో కారులో వ్యక్తి సజీవ దహనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: మేడ్చల్

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఓపెన్ ఏరియాలో నిలిపి ఉంచిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కార్తీక్(40) అనే వ్యక్తి కారులోనే సజీవంగా కాలిపోయి మృతిచెందాడు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.