మృత్యువును తలపించేలా పశువుల అక్రమ రవాణా భగ్నం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న మహీంద్రా క్యాంపర్ వాహనాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న 8 ఆవులు, 4 దూడలు సహా మొత్తం 12 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లె మార్కెట్కు పశువులను తరలిస్తుండగా ఈ ఘటన వెలుగు చూసింది. తనిఖీలను గమనించిన డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. పశువులు మరియు వాహనాన్ని మందమర్రి పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు.