కాకినాడలో మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ బిందు మాధవ్

రిపోర్టర్: సునీల్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ప్రారంభించారు. నేరస్థలాల్లో శాస్త్రీయ మరియు డిజిటల్ ఆధారాల గుర్తింపు, సేకరణ, భద్రత కోసం ఈ వాహనంలో ప్రత్యేకంగా అధునాతన పరికరాలు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఈ అత్యాధునిక వాహనం ద్వారా నేర పరిశోధన మరింత వేగవంతం కానుందని అధికారులు వెల్లడించారు.