చిన్న వయసులోనే గుండె జబ్బుల ముప్పుపై డాక్టర్ గోపి హెచ్చరిక
రిపోర్టర్: కిరణ్
స్థలం: బెంగళూరు
మానవ శరీరంలో అత్యంత కీలకమైన గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ గోపి ఎ వెల్లడించారు. నేటి ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, మధుమేహం కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఛాతీలో నొప్పి రాకముందే క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తుగా ప్రమాదాలను నివారించవచ్చని డాక్టర్ గోపి స్పష్టం చేశారు.