వేరు కాపురం పెట్టమంటే మానసిక క్రూరత్వమే: మద్రాస్ హైకోర్టు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తమిళనాడు
తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టాలని భర్తపై భార్య ఒత్తిడి తేవడం మానసిక క్రూరత్వమేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడై బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నప్పుడు, ప్రత్యేక కాపురం కోసం పట్టుబట్టడం భర్తను మానసిక వేధింపులకు గురి చేయడమేనని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల మంజూరును సమర్ధిస్తూ భార్య పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.