విమాన ప్రయాణికులకు భారీ షాక్: పెరిగిన ఫ్యూయల్ సర్ఛార్జ్ ధరలు

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్ సంస్థలు ప్రయాణికులపై ఫ్యూయల్ సర్ఛార్జ్ భారాన్ని మోపినట్లు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. అక్టోబర్ తొమ్మిది నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయని, దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులపై దూరాన్ని బట్టి అదనపు వసూళ్లు ఉంటాయని వెల్లడించారు. ఇప్పటికే ఇండిగో సంస్థ కూడా ఛార్జీలు పెంచడంతో పండుగల సీజన్లో సామాన్య ప్రజలకు ప్రయాణ భారం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.