విజయనగరం నియోజకవర్గంలో బాధితులకు సీఎం సహాయనిధి చెక్కుల అందజేత
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: విజయనగరం
విజయనగరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.6,52,767 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం బాధితులకు అందజేశారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్షమని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం చంద్రబాబు తక్షణమే ఆర్థిక చేయూతనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.