కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌ వన్‌లోకి డర్హమ్‌ జట్టు ప్రమోషన్!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: England

ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డర్హమ్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో డివిజన్‌ వన్‌లోకి ప్రమోషన్‌ సాధించింది. మిడిల్‌సెక్స్‌పై ఘన విజయం సాధించి టోర్నీలో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ విజయంపై ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తనదైన శైలిలో స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా పోస్ట్ పెట్టడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.