అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి చకోర సినిమా

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు అత్యధిక మొత్తానికి సొంతం చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు.