హైదరాబాద్‌లో అర్ధరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్ వద్దు: సీపీ సజ్జనార్ హెచ్చరిక
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారితో పాటు కుటుంబసభ్యుడు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినరోజు వేడుకలను ఇళ్ల వద్దే జరుపుకోవాలని, అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి ప్రాణాలను రిస్క్ లో పెట్టకోవద్దని సజ్జనార్ స్పష్టం చేశారు.