తిరుమలకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుపతి జిల్లా

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆయనకు స్వాగతం పలికారు. తిరుమలలోని శ్రీభాగ్య విశ్రాంతి భవనానికి చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ఘన స్వాగతం పలికారు.