సమతుల్య ఆహారంతో ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమన్న ఐసీడీఎస్ సూపర్వైజర్
రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY
స్థలం: వలిగొండ
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని అంగన్వాడీ-2 కేంద్రంలో మంగళవారం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే రక్తహీనతను నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఐసీడీఎస్ వలిగొండ సెక్టర్ సూపర్వైజర్ పారిజాత, అంగన్వాడీ టీచర్ బాలవిజయ తెలిపారు. ఈ సందర్భంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్లతో ప్రత్యేక ఆహార ప్రదర్శనను ఏర్పాటు చేశారు.