వైఎస్సార్సీపీ నేతల దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పోర్ట్స్ కోటా టీచర్లు
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వైఎస్సార్సీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు పొందామని స్పష్టం చేశారు. తమ సర్టిఫికెట్లు నకిలీవంటూ సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే పరువు నష్టం దావాలు వేస్తామని హెచ్చరించారు.