అక్టోబర్ తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న బా బా బ్లాక్ షీప్ సినిమా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం బా బా బ్లాక్ షీప్. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేణు దోనెపూడి నిర్మిస్తుండగా అక్టోబర్ తొమ్మిదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేఘాలయ రాష్ట్రంలోనే ఈ సినిమా మొత్తం చిత్రీకరణ జరిపినట్లు మేకర్స్ తెలిపారు.