సుల్తానాబాద్ లోని మానసిక వికలాంగుల పాఠశాలలో తల్లిదండ్రుల ప్రత్యేక సమావేశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సుల్తానాబాద్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని క్యాడర్ మానసిక వికలాంగుల పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. నయిదిశ ఫౌండేషన్ హైదరాబాద్ స్టేట్ టీం ఆధ్వర్యంలో ఔట్రీచ్ ఆఫీసర్లు శిరీష, శ్రీనివాస్ పిల్లల అవసరాలు, అందుబాటులో ఉన్న సేవలు, టోల్‌ఫ్రీ నంబర్ 8448448996పై అవగాహన కల్పించారు. ఇంత మంచి పాఠశాలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్‌కు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, క్యాడర్ ఫౌండర్ హరిబాబు, కరస్పాండెంట్ గజ్జెల్లి సతీష్, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.