కేసీఆర్ భూముల పై రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్నె ప్రభాకర్ డిమాండ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

కేసీఆర్‌కు వెయ్యి ఎకరాలు ఉన్నాయంటూ ఇన్నాళ్లూ అసత్య ఆరోపణలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, అసెంబ్లీలో 67 ఎకరాలేనని ఒప్పుకొని ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు హద్దులు దాటి బీఆర్ఎస్ నేతల భూముల్లోకి చొరబడాలని చూస్తే తీవ్రమైన ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.