ఆమనగల్ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జోనల్ క్రీడల ప్రారంభం
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 70వ ఎస్జీఎఫ్ఐ జోనల్ స్థాయి అండర్-14, అండర్-17 వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు మండలాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ఈ టోర్నమెంట్‌కు హాజరయ్యారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని మండల విద్యాధికారి పాండు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.