ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హయాంలో అభివృద్ధి ముందంజ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంచిర్యాల

మంచిర్యాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందంజలో ఉందని మంచిర్యాల మాదిగ యూత్ సభ్యులు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వాల పాలనలో నియోజకవర్గం వెనుకబడిపోయిందని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత అనేక నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని నాయకులు తెలిపారు.