ఏఐ టెక్నాలజీ సహాయంతో పందొమ్మిదేళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడి అరెస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: చెన్నై

సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేస్తూ చెన్నై పోలీసులు పందొమ్మిదేళ్లుగా పరారీలో ఉన్న హత్యానేర నిందితుడిని ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అరెస్ట్ చేశారు. చెన్నై తిరువొత్తియూర్ ప్రాంతంలో 2007లో జరిగిన పండియామణి హత్య కేసులో నిందితుడైన షేక్ అబ్దుల్లా, బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు విచారణకు హాజరుకాకుండా తలదాచుకుంటూ వచ్చాడు. చెన్నై నార్త్ జోన్ సీరియస్ క్రైమ్స్ యూనిట్ పోలీసులు అతడి పాత ఫొటో ఆధారంగా ఏఐ ఏజ్ ప్రోగ్రెస్ ప్రిడిక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుత రూపాన్ని అంచనా వేసి తిరుముల్లైవాయల్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.