వందేభారత్ రైలు ఘనత: మధురా నాగ్డా సెక్షన్లో 180 కిమీ వేగంతో ట్రయల్స్

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

భారతీయ రైల్వే రంగంలో మరో మైలురాయి నమోదైందని, మధురా-నాగ్డా సెక్షన్లో పదహారు కోచ్ల వందేభారత్ చైర్ కార్ రైలును గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా పరీక్షించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ సెమీ-హై-స్పీడ్ రైలు పనితీరు, భద్రతా ప్రమాణాలు మరియు నిర్వహణ సామర్థ్యాన్ని ఈ హై-స్పీడ్ ట్రయల్ ద్వారా పూర్తిగా పరిశీలించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.