మర్రిపాడులో చెరువు శిఖం భూముల కబ్జాపర్వం.. పట్టించుకోని అధికారులు!

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండల పరిధిలోని చినమాచునూరు పంచాయతీ పోలీరెడ్డిపల్లి చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. కొందరు దళారుల అండతో సుమారు పది ఎకరాలకు పైగా చెరువు భూమిని చదును చేస్తూ మట్టి పోస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

చెరువు కట్టను తొలిచి, తూమును పూడ్చివేస్తున్నా ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.