హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత: అమెరికా డ్రోన్లు, ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన ఇరాన్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Strait of Hormuz

హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాతో సైనిక ఘర్షణ తీవ్రతరమైనట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అమెరికాకు చెందిన డ్రోన్లతో పాటు ఆయిల్ ట్యాంకర్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది.