రోలుగుంట జడ్పీటీసీ అభ్యర్థిగా యర్రంశెట్టి శ్రీనివాసరావు నామినేషన్
రిపోర్టర్: G TAMMUNAIDU
స్థలం: రోలుగుంట
రోలుగుంట మండల వైయస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా యర్రంశెట్టి శ్రీనివాసరావు బుధవారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తరలివచ్చిన ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో ఎంపీపీగా సేవలందించిన ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.