బెంగళూరు ఫోర్టిస్ ఆసుపత్రిలో మూడు వేల రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్ణాటక

బెంగళూరులోని ఫోర్టిస్ ఆసుపత్రి రోబోటిక్-సహాయక శస్త్రచికిత్సల్లో సరికొత్త మైలురాయిని సాధించింది. డా విన్సి ఎక్స్ఐ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ఇప్పటివరకు మూడు వేల విజయవంతమైన రోబోటిక్ సర్జరీలను పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మూత్రపిండ మార్పిడి, గైనకాలజీ, ఆంకాలజీ వంటి క్లిష్టమైన వైద్య విధానాలలో ఈ అతధునాతన టెక్నాలజీ రోగులకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు తెలిపారు.