నా జీవితాన్ని మార్చిన కాగితం ఇడుపు కాయితం

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తెలంగాణ నేపథ్య చిత్రం 'ఇడుపు కాయితం'. ఈ సినిమాలోని 'శ్రీలత' పాటకు మంచి స్పందన వస్తోందని సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, గీత రచయిత అలరాజు తెలిపారు. తెలంగాణ జానపద శైలిని మెలోడీగా మలిచామని, ఈ చిత్రం తన బతుకును మార్చిందని అలరాజు పేర్కొన్నారు. వంశీ దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాత.