బెంగళూరులో నివసించాలంటే లక్ష జీతం ఉండాలంటూ కంటెంట్ క్రియేటర్ శివాంక్ గోయెల్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: Bengaluru
నెలవారీ సంపాదన లక్ష రూపాయల కంటే తక్కువ ఉంటే ఉద్యోగులు బెంగళూరు నగరానికి రావద్దని ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శివాంక్ గోయెల్ స్పష్టం చేశారు. నగరంలో పెరుగుతున్న జీవన వ్యయం, కాఫీ కల్చర్ మరియు అద్దెల భారంపై ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పన్నెండు లక్షల వార్షిక ప్యాకేజీ కూడా కేవలం నాలుగు లక్షల రూపాయలలాగే మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.