మహేష్ బాబు చాలా స్వీట్ అండ్ కైండ్: షారుఖ్ ఖాన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆస్క్ ఎస్సార్కే సెషన్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్‌ను ఒక్క మాటలో వర్ణించమన్న అభిమానికి సమాధానంగా, తాను కలిసిన ప్రతిసారీ మహేష్ చాలా స్వీట్ మరియు కైండ్‌గా ఉంటారని తెలిపారు. ఈ ఇద్దరు ప్రముఖ నటుల మధ్య ఉన్న పరస్పర గౌరవం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.