నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతున్న ఉమ్మడి నెల్లూరు రైతుబజార్లు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రైతుబజార్లు తీవ్ర నిర్వహణ లోపాలు, అధికారుల నిర్లక్ష్యంతో సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. కావలి, పొదలకూరు, గూడూరుతో పాటు నెల్లూరు నగరంలోని రైతుబజార్లలో రైతులు కాకుండా దళారులు, వ్యాపారుల హవా నడుస్తోంది. మౌలిక వసతులు కరవై, భవనాలు శిథిలావస్థకు చేరడంతో ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయింది. ఖాళీగా ఉంటున్న గదులను అద్దెకు ఇవ్వడం, రోడ్లపైనే అమ్మకాలు సాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.