అరెస్టు విధానం నిబంధనలకు విరుద్ధమైతే నిందితులు వెంటనే విడుదలవుతారన్న సుప్రీంకోర్టు
రిపోర్టర్: గోపి
స్థలం: దిల్లీ
వ్యక్తుల అరెస్టు విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 22 ఒకటో ఉపభాగం, 22 రెండో ఉపభాగం ప్రకారం లేకపోతే నిందితులు వెంటనే విడుదలవుతారని, వారిని తిరిగి అరెస్టు చేయాలంటే స్థానిక న్యాయస్థాన మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.