నాతవరం మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మంగవేణి

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాథవరం

నాతవరం మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం పూర్తికావడంతో మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి జి. మంగవేణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్, ఏవో పి. పార్థసారథి తదితరులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.