రైల్వేకోడూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరిస్తూ పోటెత్తిన ఆర్యవైశ్యులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రైల్వేకోడూరులో శ్రీ ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పెండల విజయకుమార్ పాల్గొని ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు మరియు మహిళా మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నివాళులు అర్పించారు.