నెన్నెల్లో భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నెన్నెల
నెన్నెల గ్రామంలో భార్య తోట సబితను హత్య చేసిన తోట మల్లేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానంతో భార్యను వేధిస్తూ, గొంతు నులిమి, పదునైన వస్తువుతో దాడి చేసి హత్య చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సి.హెచ్. హనూక్ వెల్లడించారు.
హత్య అనంతరం పరారైన నిందితుడిని తాళ్లగురజాల వై-జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించారు.