వైఎస్ జగన్ ను కలిసి కుమారుడి వివాహ ఆహ్వానపత్రిక అందించిన శ్రీనివాసరెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను చిట్వేల్ మండలం నాగవరం కన్వీనర్ చెవ్వు శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న తన కుమారుడి వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి స్వయంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.