తాపంతో అల్లాడిన జనానికి ఊరటనిస్తూ హుస్నాబాద్‌లో కురిసిన భారీ వర్షం
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నుండి భారీగా వరదలు వెళ్లాయి. గత నాలుగు రోజులుగా వర్షాలు లేక ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ వర్షంతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.