నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పథకాల పేరుతో ఫైరవీకారుల వసూళ్ల దందా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలోని భీంగల్, కమ్మర్పల్లి మండలాల్లో ఆసరా పింఛన్లు, కుట్టు మిషన్ల మంజూరు పేరిట ఫైరవీకారులు వేలల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ కోసం రూ. 10 వేల నుండి రూ. 15 వేలు, సదరం సర్టిఫికెట్ కోసం రూ. 25 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. అధికారుల మద్దతుతోనే ఈ దందా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతుండటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.