స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల రద్దుపై కూటమి మంత్రుల తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పాతిక శాతం రిజర్వేషన్లు దక్కకుండా వైకాపా నాయకులు కుట్రలు పన్నుతున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. బీసీలను అణగదొక్కాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం బీసీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని మంత్రులు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్ తేల్చిచెప్పారు.