మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి వద్ద విషాదం: చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులోకి దూకి సాయి మహేశ్వర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నల్లగండ్లకు చెందిన ఇతను కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలించి నీటిలో నుండి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.