తిరుమలలో ఘనంగా శ్రీవేంకటేశ్వర మ్యూజియం ప్రారంభం

రిపోర్టర్: సురేష్ స్థలం: తిరుపతి

తిరుమలలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.145 కోట్లతో పునర్నిర్మించిన శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. జీ+3 అంతస్తులు, 19 గ్యాలరీలు, 14 వేలకు పైగా కళాఖండాలతో దీన్ని తీర్చిదిద్దారు. 3డీ, 7డీ అత్యాధునిక సాంకేతికతతో శ్రీవారి వైభవం, హైందవ ధర్మ ఔన్నత్యాన్ని కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేయనుంది.