పాలకొండ ఆర్టీసీలో సీనియర్ ఉద్యోగి రాజుకు ఆత్మీయ వీడ్కోలు పలికిన సిబ్బంది
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ ఏపీఎస్ఆర్టీసీ డిపోలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ సీనియర్ సభ్యుడు ఎస్వీఎన్ రాజు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ కార్యాలయంలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించి, ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు.