శబరిమల యాత్రికులకు తీపి కబురు: ప్రత్యేక ప్యాకేజీలు ప్రారంభించిన ఆర్టీసీ అధికారులు
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
శబరిమల యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి షమీమ్ తెలిపారు. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లో సోమవారం అయ్యప్పస్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శబరిమల టికెట్ కౌంటర్‌ను ఆమె ప్రారంభించారు. కార్తికమాసం సందర్భంగా రాష్ట్రంలోని అయిదు ప్రముఖ శైవ క్షేత్రాల దర్శనానికి కూడా ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.